IOCL Recruitment 2025 | ఇండియన్ ఆయిల్ లో 457 అప్రెంటిస్ పోస్టులు

IOCL Recruitment 2025 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(IOCL) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 457 అప్రెంటిస్ పైప్ లైన్స్ డివిజన్ పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 24 సంవత్సరాలు ఉండలి. అసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.

ICOL Apprentice Pipeline Division Recruitment 2025

పోస్టుల వివరాలు :

ICOL Apprentice Pipeline Division Recruitment 2025 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అప్రెంటిస్ పైప్ లైన్ డివిజన్ పోస్టుల నియామకం చేపడుతున్నారు. మొత్తం పోస్టులు 457 ఉన్నాయి.

● టెక్నిషియన్ అప్రెంటిస్ (మెకానికల్)
● టెక్నిషియన్ అప్రెంటిస్ (ఎలక్ట్రికల్)
● టెక్నిషియన్ అప్రెంటిస్ (టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ స్ట్రుమెంటేషన్)
● ట్రేడ్ అప్రెంటిస్ (అసిస్టెంట్- హ్యూమన్ రిసోర్స్)
● ట్రేడ్ అప్రెంటిస్ (అకౌంటెంట్)
● డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఫ్రెషర్ అప్రెంటిస్)
● డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్లు)

CSIR Recruitment 2025 | రూ.49 వేల జీతంతో ఉద్యోగాలు | ఇంటర్ పూర్తి అయిన వారికి మంచి ఛాన్స్

అర్హతలు :

ICOL Apprentice Pipeline Division Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో 12వ తరగతి, డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

వయస్సు :

ICOL Apprentice Pipeline Division Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 28 ఫిబ్రవరి 2025 నాటికి 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు వయస్సు ఉండాలి. ICOL నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు మరియు జీతం :

ICOL Apprentice Pipeline Division Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అందరూ కూడా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ లో స్టైఫండ్ అనేది ఇస్తారు. అయితే స్టైఫండ్ ఎంత ఇస్తారనే దానిపై నోటిఫికేషన్ లో ఇవ్వలేదు.

ఎంపిక ప్రక్రియ:

ICOL Apprentice Pipeline Division Recruitment 2025 ఉద్యోగాలకు కింద దశల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

● రాత పరీక్ష
● ఇంటర్వ్యూ
● గ్రూప్ డిస్కషన్
●డాక్యుమెంట్ వెరిఫికేషన్
● వైద్య పరీక్ష

దరఖాస్తు విధానం :

ICOL Apprentice Pipeline Division Recruitment 2025 పోస్టులకు దఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు మార్చి 3వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ICOL అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 10 – 02 – 2025

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేేదీ : 03- 03 – 2025

Notification : CLICK HERE

Apply Online : CLICK HERE

Leave a Comment