KMRL Recruitment 2025 : Kochi Metro Rail Limited నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్, అడిషనల్ జనరల్ మేనేజర్ మరియు సెక్షన్ ఇంజనీర్ పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 06 పోస్టులు ఉన్నాయి. బీఈ, బీటెక్ అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు మార్చి 19వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
Metro KMRL Recruitment 2025
పోస్టుల వివరాలు :
కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ నుంచి ఎగ్జిక్యూటివ్, అడిషనల్ జనరల్ మేనేజర్, సెక్షన్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టులు 06 ఉన్నాయి.
పోస్టులు | ఖాళీలు |
ఎగ్జిక్యూటివ్ (మెరైన్) | 01 |
ఎగ్జిక్యూటివ్ (సివిల్) – వాటర్ ట్రాన్స్ పోర్ట్ | 03 |
అడిషనల్ జనరల్ మేనేజర్ | 01 |
సెక్షన్ ఇంజనీర్ – పవర్ అండ్ ట్రాక్షన్ | 01 |
అర్హతలు :
Metro KMRL Recruitment 2025 కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్, జనరల్ మేనేజర్, సెక్షన్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. దీంతో పాటు సంబంధిత రంగంలో అనుభవం కూడా అవసరం.
పోస్టులు | అర్హతలు |
ఎగ్జిక్యూటివ్ (మెరైన్) | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెరైన్ / మెకానికల్ ఇంజనీరింగ్ లో బీఈ / బీటెక్ అర్హత కలిగి ఉండాలి. |
ఎగ్జిక్యూటివ్ (సివిల్) – వాటర్ ట్రాన్స్ పోర్ట్ | సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ / బీటెక్ |
అడిషనల్ జనరల్ మేనేజర్ | బీఈ / బీటెక్ |
సెక్షన్ ఇంజనీర్ | బీఈ / బీటెక్ లేదా ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేష్ ఇంజనీరంగ్ లో మూడేళ్ల డిప్లొమా కలిగి ఉండాలి. |
వయస్సు :
Metro KMRL Recruitment 2025 కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసేకునే అభ్యర్థులకు పోస్టులను బట్టి వయోపరిమితి మారుతుంది. ఎగ్జిక్యూటివ్ (మెరైన్), ఎగ్జిక్యూటివ్ (సివిల్) పోస్టులకు 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అడిషనల్ జనరల్ మేనేజర్ పోస్టుకు 50 సంవత్సరాలు, సెక్షన్ ఇంజనీర్ పోస్టుకు 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
Metro KMRL Recruitment 2025 కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరీల అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ఉండదు.
ఎంపిక ప్రక్రియ:
Metro KMRL Recruitment 2025 కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం :
Metro KMRL Recruitment 2025 కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/- నుంచి రూ.1,40,000/- వరకు జీతం చెల్లిస్తారు. అన్ని కలుపుకుని నెలకు రూ.60,000/- వరకు జీతం ఇస్తారు. జనరల్ మేనేజర్ పోస్టులకు రూ.లక్షకు పైగా జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
Metro KMRL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి లింక్ కింద ఇవ్వబడింది.
ముఖ్యమైన తేదీలు :
Metro KMRL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పుటికే ప్రారంభమైంది. మార్చి 19వ తేేదీలోపు దరఖాస్తులు సమర్పించవచ్చు.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ | 05 – 03 – 2025 |
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేేదీ | 19 – 03 – 2025 |
Notification & Apply Online : CLICK HERE