LIC Urban Career Agent Notification 2025
జీవితంలో అత్యున్నత స్థాయికిఎదగాలనుంటున్న వారికి, కష్టించి నమ్మకంగా పనిచేయగల వారికి, స్వయం ఆధిపత్యాన్ని కలిగి ఉండాలనుకుంటున్న వారికి LIC మంచి అవకాశం కల్పిస్తుంది. LIC ఉజ్వల భవిష్యత్తుగల ఇండిపెండెంట్ కెరీర్ ను ఆఫర్ చేస్తూ LIC Urban Career Agent Notification 2025 జారీ చేసింది. ఏపీలోని విజయవాడ కేంద్రంగా ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆఫీస్ పరిధిలో ఈ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఏదైనా డిగ్రీ చదివిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను చూసి దరఖాస్తు చేసుకోండి.
పోస్టు వివరాలు : Urban Career Agent
విజయవాడ కేంద్రంగా ఉన్న LIC నుంచి Urban Career Agent గా పనిచేయడానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేేసింది.
విద్యార్హతలు :
LIC Urban Career Agent గా పని చేయడానికి ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి.
- భారతీయ జీవిత బీమా సంస్థ ఉద్యోగులు మరియు ఏజెంట్లు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రభత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములు అనర్హులు.
-డెవలప్మెంట్ ఆఫీసర్లు / ఏజెంట్లు / ఉద్యోగుల బంధువులు అనర్హులు.
-పున:నియామకాన్ని కోరుతున్న విశ్రాంత ఉద్యోగులు / మాజీ ఏజెంట్లు LIC Urban Career Agent గా నియామకానికి అనుమతించబడరు.
DRDO Recruitment 2025 | విశాఖ డీఆర్డీవో లో ఉద్యోగాలు
వయోపరిమితి :
LIC Urban Career Agent గా పనిచేయడానికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 02.01.1989 కి ముందు, మరియు 01.01.2004 తర్వాత పుట్టిన వారై ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు మరియు సేల్స్ అండ్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది.
జీతం :
LIC Urban Career Agent ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12,000(మొదటి సంవత్సరం), రూ.11,000(రెండో సంవత్సరం), రూ.10,000(3వ సంవత్సరం) స్టయిఫండ్ ఇస్తారు. 75శాతం స్టైఫండ్ నెల చివరన చెల్లిస్తారు. 25 శాతం నెలవారీ స్టైఫండ్ 12 నెలలకు కలిపి, ఏకమొత్తంగా ఒకేసారి చెల్లిస్తారు. అంతేకాక చేసిన బిజినెస్ ని బట్టి అదనంగా కమిషన్ ఇవ్వబడుతుంది. షరతుల మేరకు 3 సంవత్సరాల తర్వాత CLIAshipకి అర్హులవుతారు.
నివాస షరతులు :
01 జనవరి 2025 నాటికి కెరీర్ ఏజెంట్ బ్రాంచ్ యొక్క అధికార పరిధిలో కనీసం ఒక సంవత్సరం నుంచి నివసిస్తూ ఉండాలి. ఓటర్ కార్డు లేదా రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లేదా ఆధార్ కార్డు నివాస రుజువు కోసం అవసరం అవుతాయి.
ఎంపిక ప్రక్రియ :
LIC Urban Career Agent ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష, ఫీజు ఉండదు. విజయవాడ సిటీలోని బ్రాంచ్ పరిధిలో నివాసం ఉండే వారికి ప్రాధాన్యత కల్పిస్తూ ఉద్యోగాలు ఇస్తారు.
చివరి తేదీ :
LIC Urban Career Agent ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు ఆసక్తిగల అభ్యర్థులు 31 జనవరి 2025 తేదీలోపు కింద తెలిపిన బ్రాంచ్ ఆఫీస్ లో సంప్రదించాలి.
అడ్రస్ : బ్రాంచ్ మేనేజర్, ఎల్ఐసీ ఆఫ్ ఇండియా, కెరీర్ ఏజెంట్స్ బ్రాంచ్, విజయవాడ. ఈ నెంబర్ కి కాల్ చేసి వివరాల తెలుసుకోగలరు. ఫోన్ నెంబర్ – 9490183911
Notification : CLICK HEREE
1 thought on “LIC Recruitment 2025 | LIC కెరీర్ ఏజెంట్ జాబ్స్ | డిగ్రీ చదివిన వారికి అవకాశం”