NPCIL Recruitment 2025 | న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో 391 జాబ్స్

NPCIL Recruitment 2025 న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL) నుంచి భారీ నోటిఫికేషన్ వెలువడింది. సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండియరీ ట్రైనీ, పారామెడికల్ మరియు నాన్ టెక్నికల్ పోస్టుల నియామకాలను చేపడుతున్నారరు. మొత్తం 391 ఖాళీలు ఉన్నాయి. మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.  ఎంపికైన అభ్యర్థులు కర్ణాటకలోని కైగా సైట్ లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలనుు చదివి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 

NPCIL Recruitment 2025

పోస్టుల వివరాలు : 

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక ప్రభత్వ రంగ సంస్థ. ఈ సంస్థలో వివిధ రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 391 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీలు
సైంటిఫిక్ అసిస్టెంట్-బి45
స్టైపెండియరీ ట్రైనీ / సైంటిఫిక్ అసిస్టెంట్82
స్టైపెండియరీ ట్రైనీ / టెక్నీషియన్226
అసిస్టెంట్ గ్రేడ్ – 1 (HR)22
అసిస్టెంట్ గ్రేడ్ – 1 (F&A)4
అసిస్టెంట్ గ్రేడ్ – 1 (C&MM)10
నర్స్  – A1
టెక్నీషియన్ / సి (ఎక్స్ – రే టెక్నీషియన్)1

అర్హతలు : 

NPCIL Recruitment 2025 న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి 10వ తరగతి, 12వ తరగతి, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టు పేరు అర్హతలు
సైంటిఫిక్ అసిస్టెంట్ – బిసివిల్ / ఎలక్ట్రికల్ / మెకానికల్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్ స్ట్రుమెంటేషన్ లో డిప్లొమా (లేదా) BSc(Computer Science)
స్టైపెండియరీ ట్రైనీ / సైంటిఫిక్ అసిస్టెంట్సివిల్ / ఎలక్ట్రికల్ / మెకానికల్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్ స్ట్రుమెంటేషన్ లో డిప్లొమా (లేదా) BSc(Computer Science)
స్టైపెండియరీ ట్రైనీ / టెక్నీషియన్10వ తరగతి మరియు ఐటిఐ
అసిస్టెంట్ గ్రేడ్-1 (HR / F&A / C&MM)ఏదైనా డిగ్రీ
నర్స్-ఎ12వ తరగతి మరియు డిప్లొమా
టెక్నీషియన్/సి(ఎక్స్ – రే టెక్నీషియన్)12వ తరగతి మరియు మెడికల్ రేడియోగ్రఫీ సర్టిపికెట్

వయస్సు : 

NPCIL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టులను బట్టి అర్హతలు మారుతాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

పోస్టు పేరు వయస్సు
సైంటిఫిక్ అసిస్టెంట్ – బి18 నుంచి 30 సంవత్సరాలు
స్టైపెండియరీ ట్రైనీ / సైంటిఫిక్ అసిస్టెంట్18 నుంచి 25 సంవత్సరాలు
స్టైపెండియరీ ట్రైనీ / టెక్నీషియన్18 నుంచి 24 సంవత్సరాలు
అసిస్టెంట్ గ్రేడ్-1 (HR / F&A / C&MM)21 నుంచి 28 సంవత్సరాలు
నర్స్-ఎ18 నుంచి 30 సంవత్సరాలు
టెక్నీషియన్/సి(ఎక్స్ – రే టెక్నీషియన్)18 నుంచి 25 సంవత్సరలు

దరఖాస్తు ఫీజు: 

NPCIL Recruitment 2025 సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండియరీ ట్రైనీ/సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు నర్స్ పోస్టులకు రూ.150/-, ఇతర పోస్టులకు రూ.100/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి. 

ఎంపిక ప్రక్రియ: 

NPCIL Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

1.రాత పరీక్ష

  • ప్రలిమినరీ టెస్ట్
  • అడ్వాన్స్డ్ టెస్ట్

2.వ్యక్తిగత ఇంటర్వ్యూ / స్కిల్ టెస్ట్

3.డాక్యుమెంట్ వెరిఫికేషన్ 

జీతం : 

NPCIL Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు భారీ స్థాయిలో జీతాలు అయితే చెల్లిస్తారు. పోస్టుల వారీగా జీతాలు కింద ఇవ్వబడ్డాయి. 

పోస్టు పేరు జీతాలు 
సైంటిఫిక్ అసిస్టెంట్ – బిరూ.54,162/-
స్టైపెండియరీ ట్రైనీ / సైంటిఫిక్ అసిస్టెంట్రూ.24,000/-
స్టైపెండియరీ ట్రైనీ / టెక్నీషియన్రూ.26,000/-
అసిస్టెంట్ గ్రేడ్-1 (HR / F&A / C&MM)రూ.39,015/-
నర్స్-ఎరూ.68,697/-
టెక్నీషియన్/సి(ఎక్స్ – రే టెక్నీషియన్)రూ.39,015/-

దరఖాస్తు విధానం : 

NPCIL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కింద ఇవ్వబడింది. అభ్యర్థులు ఆ లింక్ పై క్లిక్ చేేసి డైరెక్టుగా అప్లయ్ చేసుకోవచ్చు. 

ముఖ్యమైన తేదీలు: 

NPCIL Recruitment 2025 పోస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 1వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ12 – 03 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ01 – 04 – 2025
NotificationCLICK HERE
Apply Online CLICK HERE

Leave a Comment