పోస్టల్ GDS జాబ్స్ :
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్స్ లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ అనే ఉద్యోగం చాలా మంచి ఉద్యోగం అని చెప్పవచ్చు. ఎవరైతే అభ్యర్థులు ఫర్దర్ స్టడీస్ ని కొనసాగించాలని అనుకుంటున్నారో.. అలాగే కాంపిటేటీవ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారికి ఇది మంచి ఉద్యోగం.. ఫైనాన్షియల్ గా సరిగ్గా లేక.. జాబ్ చేసుకుంటూ చదువుకోవాలని అనుకుంటున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు.
టెన్త్ అయిపోగానే జాబ్ చేస్తూ చదువుకున్న వారికి పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగం మంచి అవకాశం. కొంత మంది ఈ ఉద్యోగం మంచిది కాదు అని చెబుతుంటారు.. కానీ మనకు ఏదైన ఒక ఉద్యోగం ఉంటూ ఫర్దర్ గా పెద్ద ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటే.. ఆ కాన్ఫిడెంట్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ప్రైవేట్ కంపెనీలో పని చేయడం కన్న పోస్టల్ జీడీఎస్ లో పని చేయడం మంచి అవకాశం..
పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ అనేది డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అయితే కాదు.. కానీ పర్మనెంట్ జాబ్ అనే చెప్పాలి. దీనిలో ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి. జీవం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
What is the job of Branch Post Master?
ఇక్కడ BPM – అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. గ్రామ పంచాయతీకి, ఇంక రెండు మూడు ఊర్లకు కలిపి ఒక బీపీఎం ఉంటాడు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఒక అడ్మినిస్టేటర్ గా ఉంటారు. వీరికి ఎంజీఎన్ఆర్ఐజీఎస్ అంటే కరువు పనికి సంబంధించిన జీతం అయితే ఇస్తారు. మరియు పెన్షన్ కూడా వీళ్లే ఇవ్వడం జరుగుతుంది. బీపీఎం కింద ఎండీ, ఎంసీ, ప్యాకర్స్ ని నియమిస్తారు. వీళ్లు దగ్గర్లో ఉన్న సబ్ పోస్ట్ ఆఫీస్ కి రిపోర్ట చేయాల్సి ఉంటుంది. బీపీఎం అనే వారు ఆ బ్రాంచ్ కి అధికారిగా ఉంటారు.
What are the duties of Grameen Dak Sevak?
ఇక ABPM అనే వారు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనే వారు బీపీఎంకి అసిస్టెంట్ గా పనిచేయాల్సి ఉంటుంది. ఇక గ్రామీణ డాక్ సేవక్ చేసే ముఖ్యమైన పని ఏంటంటే వీరు స్టాంపులు కానీ, స్టేషనరీకి సంబంధించిన పని, పోస్ట్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ కి సంబంధించి అకౌంట్స్ తీయడం కనీ, డబ్బులు విత్ డ్రా చేయడానికి సంబంధించిన పని చేయాల్సి ఉంటుంది.
What is the salary?
ఇక గ్రామీణ డాక్ సేవక్ లకు జీతం ఎంత ఉంటుందో ఒక సారి చూసుకుంటే.. వీరికి టైమ్ ని బట్టి సాలరీ ఉంటుంది. వీళ్లకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని జీతం పెంచడం జరుగుతుంది. ఇకప్పుడున్న జీతం మనం చూసుకుంటే..
BPM కి 4 గంటలు పనిచేస్తే రూ.12,000 రూపాయలు జీతం, 5 గంటలు పనిచేస్తే రూ.14,500 జీతం ఉంటుంది. అదే గ్రామీణ డాక్ సేవక్ కి 4 గంటల పనికి రూ.10,000, 5 గంటలు పనిచేస్తే రూ.12,000 జీతం ఇస్తారు. అయితే జీడీఎస్ లో ఎంపికైన వారికి ప్రమోషన్లు తక్కువగా ఉంటాయి. అందుకే జాబ్ చేసుకుంటూ ఇతర ఉద్యోగాలకు ప్రీపేర్ అయ్యే వారికి ఈ ఉద్యోగాలు మంచి అవకాశం అనే చెప్పొచ్చు.