Railway RRC SECR Recruitment 2025 | రైల్వే శాఖలో 1,007 పోస్టులకు నోటిఫికేషన్

Railway RRC SECR Recruitment 2025 ఇండియన్ రైల్వే నుంచి ఓ మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. South East Central Railway (SECR) అప్రెంటిస్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,007 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 5వ తేదీ నుంచి ప్రారంభమైంది. మే 4వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. 

Railway RRC SECR Notification 2025

Job details : 

South East Central Railway (SECR), RRC నాగ్ పూర్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన వారికి ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్ మీకు రైల్వే శాఖ నుంచి జాబ్స్ విడుదలైనప్పుడు ఉపయోగపడుతుంది. ట్రైనింగ్ సమయంలో స్టయిఫండ్ కూడా ఇస్తారు. 

RRC SECR Apprentice Notification 2025 పోస్టుల్లో వివిధ రకాల ట్రేడ్స్ ఉన్నాయి. మొత్తం పోస్టులు 1,007 ఉన్నాయి. అభ్యర్థులు తాము ఏ ట్రేడ్ కి దరఖాస్తు చేసుకోవచ్చు అనేది నోటిఫికేషన్ లో చూపి అప్లయ్ చేసుకోగలరు. 

Education Qualification : 

RRC SECR Apprentice Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మరియు సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 

AGE : 

RRC SECR Apprentice Notification 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

Application Fee : 

RRC SECR Apprentice Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరిల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అందరు ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చు. 

Selection Process : 

RRC SECR Apprentice Notification 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 10వ తరగతి మరియు ఐటిఐలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు. 

Salary : 

RRC SECR Apprentice Notification 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో స్టయిఫండ్ అనేది ఇస్తారు. ట్రైనింగ్ లో నెలకు రూ.8,050/- స్టయిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 

How to Apply RRC SECR Apprentice Notification 2025 : 

అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులుు మే 4వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. లింక్ క్లిక్ చేసి డైరెక్టుగా దరఖాస్తు చేసుకోగలరు. 

Important Dates: 

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ05 – 04 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ04 – 05 – 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Leave a Comment