RBI Internship 2025 ఆర్బీఐ ఇంటర్న్ షిప్.. నెలకు రూ.45 వేలు స్టైఫండ్..

ఏదైన డిగ్రీ, పీజీ చేస్తున్నా లేదా పూర్తి అయిన విద్యార్థులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ప్రతి సంవత్సరం విద్యార్థుల కోసం ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ లో ఫ్రీగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ట్రైనింగ్ అయితే అందిస్తారు. ఈ ఇంటర్న్ షిప్ ప్రొగ్రామ్ కి ఎంపికైన ప్రతి విద్యార్థికి ప్రతినెలా రూ.45,000 స్టైఫండ్ కూడా అందించబోతున్నారు. అప్లయ్ చేసేందుకు ఎలాంటి ఎగ్జామ్ రాయాల్సిన పనిలేదు.. ఎలాంటి ఫీజు లేదు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆన్ లైన్ ల ఫ్రీగా అప్లయ్ చేేసుకోవచ్చు. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్న్ షిప్ :

RBI Internship 2025:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క నియంత్రణకు బాధ్యత వహిస్తుంది. భారతదేశంలోని సెంట్రల్ బ్యాంకులను నియంత్రణ చేస్తుంది. అంతేకాదు ఇండియన్ రూపీ నియంత్రణ, జారీ మరియు సరఫరా, నిర్వహణ బాధ్యతలను ఆర్బీఐ నిర్వహిస్తుంది. రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ సెంట్రల్ బ్యాంకింగ్‌లో అత్యాధునిక పరిశోధనలకు తమను తాము బహిర్గతం చేయడానికి యువకులకు అవకాశాన్ని అందిస్తుంది. ముఖ్యంగా భారతీయ విద్యార్థినీ, విద్యార్థుల కోసం బ్యాంకింగ్ రంగంలో రాణించడానికి నైపుణ్యాలను అందజేస్తున్నారు. తగిన ట్రైనింగ్ కూడా ప్రాక్టికల్ గా అందిస్తున్నారు. వారి బ్యాంకింగ్ బ్రాంచ్ లోనే డైరెక్ట్ గా ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు. 

ఎవరు అప్లయ్ చేయాలి?

ఎ) పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులు.

బి) మేనేజ్‌మెంట్ / స్టాటిస్టిక్స్ / లా / కామర్స్ / ఎకనామిక్స్ / ఎకనామెట్రిక్స్ / బ్యాంకింగ్ / ఫైనాన్స్‌లో సమగ్ర ఐదేళ్ల కోర్సులు చేసిన విద్యార్థులు.

 సి) దేశంలోని ప్రసిద్ధ సంస్థలు / కళాశాలల నుండి న్యాయశాస్త్రంలో మూడు సంవత్సరాల పూర్తి సమయం ప్రొఫెషనల్ బ్యాచిలర్ డిగ్రీ చేసిన విద్యార్థులు. ప్రస్తుతం వారి కోర్సు యొక్క చివరి ఏడాదిలో ఉన్న విద్యార్థులు కూడా వేసవి ప్లేస్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

ప్లేస్మెంట్ వివరాలు:

ఈ ఇంటర్న్ షిప్ ప్రొగ్రామ్ అనేది 4 డిపార్ట్మెంట్లలో నిర్వహిస్తున్నారు. మీ క్వాలిఫికేషన్ ఆధారంగా మీకు ఇష్టమైన డిపార్ట్మెంట్ లో అప్లయ్ చేసుకోవచ్చు. బ్యాంక్ రంగంలో కూడా చాలా రకాల డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. DEPR, DSIM, FSD, ID డిపార్ట్మెంట్స్ లో చేరవచ్చు. 

Eligibility : 

RBI ఇంటర్న్‌షిప్ 2025 కోసం ఏదైనా స్ట్రీమ్ లో చదువుతున్న విద్యార్థులు అర్హులు.

DSIM : 

DSIM డపార్ట్మెంట్ కోసం స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, ఎకనామిక్స్ లో పీజీ లేదా బీఈ, బీటెక్ సీఎస లేదా ఎంబీఏ ఫైనాన్స్ లేదా డేటా సైన్స్ లో డిగ్రీ లేదా బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ కంప్యూటర్స్ చేసి ఉండాలి. ఎంఎస్సీ అప్లయిడ్ స్టాటిస్టిక్స్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స పూర్తి చేయాలి. 

DEPR : 

DEPR డిపార్ట్మెంట్ కోసం ఎకనామిక్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్ లేదా ఎంబీఏ ఫైనాన్స్ లేదా బీటెక్ లో పీజీ చేసి ఉండాలి. లేదా బీఈ లేదా ఎకనామిక్స్, ఫైనాన్స్, స్టాటిస్టికల్ సైన్స్ లో క్వాంటిటేటివ్ ఓరియెంటెడ్ డిగ్రీలతో పీజీ ఉండాలి. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరం అవుతుంది. 

FSD:

ఈ విభాగంలో చేరడానికి స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, ఎకనామెట్రికస్, ఫైనాన్స్ లో పీజీ లేదా ఎంబీఏ ఫైనాన్స్ చేసి ఉండాలి. 

ID : 

ఈ డిపార్ట్మెంట్ లో చేరడానికి ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో స్పెషలైజేషన్ తో ఎకానామిక్స్, స్టాటిస్టిక్స్, ఫైనాన్స్, ఇంటర్నేషన్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఎంబీఏ చేసిన వారు అర్హులు.. 

కోర్సు Duration : 

ఇక డ్యూరేషన్ విషయానికి వస్తే 6 నెలలు ఈ ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఇక బ్యాంక్ అవసరాలను బట్టి ఇంకో ఆరు నెలలు పొడిగించే అవకాశం ఉంటుంది. మీ పర్ఫామెన్స్ ని బట్టి 2 సంవత్సరాల వరకు ఇంటర్న్ షిప్ ప్రొగ్రామ్ ని పొడిగించవచ్చు. 

ట్రైనింగ్ లో ఫెసిలిటీస్:

ట్రైనింగ్ లో చేరన తర్వాత ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయంటే.. ఆర్బీఐ హెడ్ క్వార్టర్ లోనే ట్రైనింగ్ అనేది ఉంటుంది. ముంబైలోని ఆర్బీఐ హెడ్ ఆఫీస్ లో స్పెషల్ స్పేస్ ఏర్పాటు చేసి ఇంటర్న్ షిప్ అందిస్తారు. ఈ ఇంటర్న్ షిప్ ప్రొగ్రామ్ లో చేరిన ప్రతి అభ్యర్థికి కూడా నెలకు రూ.45,000 స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్ లో అవసరమైతే 12 సెలవులను కూడా కేటాయించారు. అయితే అకామడేేషన్ మనమే చూసుకోవాల్సి ఉంటుంది. 

Selection Process::

ప్రతి బ్యాచ్ లో గరిష్టంగా 20 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను డైరెక…

Leave a Comment