RRB ALP Recruitment 2025 |  రైల్వే శాఖలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు

RRB ALP Recruitment 2025 రైల్వే శాఖలో 2025 సంవత్సరంలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల కోసం 9,970 ఖాళీలను ఆమోదం తెలిపింది. ఈ నోటిఫికేషన్ అయితే అధికారికంగా ప్రకటించలేదు. ఓ పత్రికా ప్రకటన ద్వారా సోషల్ మీడియాలో ప్రకటించారు.  ఈ నోటిఫికేషన్ ప్రకారం రైల్వే శాఖ 2025 సంవత్సరానికి 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను అయితే భర్తీ చేయనుంది. అన్ని రైల్వే జోన్ల నుంచి ఈ ఖాళీలు ఉన్నట్లు ఆమోదించారు. పూర్తి వివరాలతో అధికారిక నోటిఫికేషన్ త్వరలోనే విడుదల అవుతుంది. 

RRB ALP Recruitment 2025

జోనల్స్  వారీగా ఖాళీలు :

రైల్వే జోనల్ఖాళీలు
సెంట్రల్ రైల్వే376
ఈస్ట్ సెంట్రల్ రైల్వే700
ఈస్ట్ కోస్ట్ రైల్వే1461
ఈస్టర్న్ రైల్వే768
నార్త్ సెంట్రల్ రైల్వే508
నార్త్ ఈస్టర్న్ రైల్వే100
నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే125
నార్తర్న్ రైల్వే521
నార్త్ వెస్టర్న్ రైల్వే679
సౌత్ సెంట్రల్ రైల్వే989
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే568
సౌత్ ఈస్టర్న్ రైల్వే796
సౌతర్న్ రైల్వే510
వెస్ట్ సెంట్రల్ రైల్వే759
వెస్టర్న్ రైల్వే885
మెట్రో రైల్వే కోల్ కతా225
మొత్తం9970

అర్హతలు : 

RRB ALP Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్దేశించిన అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటో మొబైల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా కలిగి ఉండాలి. 

వయస్సు : 

RRB ALP Recruitment 2025 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: 

RRB ALP Recruitment 2025 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష 1, కంప్యూటర్ ఆధారిత పరీక్ష 2, కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: 

RRB ALP Recruitment 2025 పోస్టులకు అధికారి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంకా అధికారిక నోటిపికేషన్ అయితే విడుదల చేయలేదు. త్వరలోనే indianrailways.gov.in వెబ్ సైట్ లో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇచ్చిన ఖాళీల సంఖ్య కూడా తాత్కాలికమైనవి. ఈ ఖాళీలు ఇంకా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. 

Leave a Comment