RRB ALP Recruitment 2025 | రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్

RRB ALP Recruitment 2025 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 9,970 ఫోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2024 అసిస్టెంట్ లోకో పైలట్ భర్తీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈక్రమంలో RRB Assistant Loco Pilot 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఏప్రిల్ 12వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

RRB ALP Recruitment 2025 

పోస్టుల వివరాలు: 

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 9,970 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీల పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో Annexure – B లో చూడవచ్చు.

జోన్ల వారీగా ఖాళీలు:

రైల్వే జోన్ఖాళీలు
సెంట్రల్ రైల్వే376
ఈస్ట్ సెంట్రల్ రైల్వే700
ఈస్ట్ కోస్ట్ రైల్వేే1461
ఈస్టర్న్ రైల్వే768
నార్త్ సెంట్రల్ రైల్వే508
నార్త్ ఈస్టర్న్ రైల్వే100
నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే 125
నార్తర్న్ రైల్వే521
నార్త్ వెస్ట్రన్ రైల్వే679
సౌత్ సెంట్రల్ రైల్వే989
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే568
సౌత్ ఈస్టర్న్ రైల్వే796
సదరన్ రైల్వే510
వెస్ట్ సెంట్రల్ రైల్వే759
వెస్టర్న్ రైల్వే885
మెట్రో రైల్వే కలకత్తా225

అర్హతలు: 

RRB ALP Recruitment 2025 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది విద్యార్హతల్లో ఏదో ఒకటి కలిగి ఉండాలి. 

  • మెట్రిక్యూలేషన్ / SSLC తో పాటు NCVT / SCVT గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్, మిల్ రైట్ / మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ (రేడియో అండ్ టీవీ), ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ (మోటార్ వెహికల్), వైర్ మన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్, మెకానిక్(డీజిల్), హీట్ ఇంజన్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ ట్రేడ్స్ లో ITI లేదా ఈ ట్రేడ్ కోర్సు పూర్తి చేసిన యాక్ట్ అప్రెంటిస్ షిప్. (OR)
  • మెట్రిక్యూలేషన్ / SSLC తో పాటు మెకానికల్ / ఎలక్ట్రానిక్స్ / ఆటో మొబైల్ ఇంజనీరింగ్ లో మూడు సంవత్సరాల డిప్లొమా లేదా ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ.

వయస్సు: 

RRB ALP Recruitment 2025 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు: 

RRB ALP Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

కేటగిరిఅప్లికేషన్ ఫీజు
జనరల్ రూ.500/- (CBT-1 పరీక్షకు హాజరైతే రూ.400 రీఫండ్ చేయబడుతుంది.)
ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, ట్రాన్స్ జెండర్, మైనారిటీలురూ.250/-(CBT-1కి హాజరైతే పూర్తి రీఫండ్ చేయడబడుతుంది)

ఎంపిక ప్రక్రియ:

RRB ALP Recruitment 2025 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కింది దశల్లో ఎంపిక చేస్తారు. 

  • CBT-1 
  • CBT-2
  • కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూట్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ టెస్ట్ 

మెడికల్ స్టాండర్ట్స్: అభ్యర్థులు ఎ-1 వైద్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అద్దాలు లేకుండా 6/6, 6/6 దూర ద్రుష్టి ఉండాలి. సమీప ద్రుష్టి అద్దాలు లేకుండా 0.6, 0.6 ఉండాలి. కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్ సాధారణంగా ఉండాలి. Lasik సర్జరీ లేదా ఇతర రిఫ్రాక్టివ్ సర్జరీ చేయించుకున్న అభ్యర్థులు ఈ పోస్టులకు అనర్హులు. 

జీతం: 

RRB ALP Recruitment 2025 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బేసక్ పే రూ.19,900/- ఇస్తారు. అంటే అన్ని కలుపుకుని నెలకు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు చెల్లించడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం: 

RRB ALP Recruitment 2025 పోస్టులకు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక లింక్ కింద ఇవ్వబడింది. ఆ లింక్ పై క్లిక్ చేసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు: 

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ12 – 04 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ11 – 05 – 2025
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ13 – 05 – 2025
దరఖాస్తు సవరణ విండో(రూ.250 ఫీజుతో0మే 14, 2025 – మే 23, 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICL HERE

Leave a Comment