RRB Group D Recruitment 2025 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 32,438 లెవెల్-1 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఫిబ్రవరి 22వ తేదీ వరకు మాత్రమే అప్లయ్ చేసుకోవచ్చు. 10వ తరగతి, ఐటిఐ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికలో భాగంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు ఉంటాయి. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు జీతం ఉంటుంది. దరఖాస్తులకు చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి అప్లయ్ చేయని వారు వెంటనే అప్లయ్ చేయండి. ఈ పోస్టుల గురించి తెలియని వారికి షేర్ చేసి తెలియజేయండి..
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 32,438
● పాయింట్స్ మ్యాన్-బి – 5958
● అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్) – 799
● అసిస్టెంట్(వంతెన) – 301
● ట్రాక్ మెయింటెయినర్ గ్రేడ్ 4 – 13,187
● అసిస్టెంట్ పి-వే – 247
● అసిస్టెంట్ (సి&డబ్ల్యూ) – 2587
● అసిస్టెంట్ టీఆర్డీ – 1381
● అసిస్టెంట్(ఎస్&టి) -2012
● అసిస్టెంట్ లోకో షెడ్(డీజిల్) – 420
● అసిస్టెంట్ ఆపరేషన్స్(ఎలక్ట్రికల్) – 744
● అసిస్టెంట్ లోకో షెడ్(ఎలక్ట్రికల్) – 950
● అసిస్టెంట్ TL & AC – 1041
● అసిస్టెంట్ TL & AC(వర్క్ షాప్) – 624
● అసిస్టెంట్ వర్క్ షాప్ (మెకానిక్) – 3077
అర్హతలు :
RRB Group D Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 10వ తరగతి, ఐటిఐ పాసై ఉండాలి. లేదా NCVT జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్ షిప్ సర్టిఫికెట్ కలిగి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
BEL Recruitment 2025 | BEL లో డిగ్రీ అర్హతతో 137 జాబ్స్ | నెలకు రూ.55,000 శాలరీ
వయస్సు :
RRB Group D Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు జనవరి 1, 2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
RRB Group D Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500/- ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, మహిళలకు రూ.250/- ఫీజు చెల్లించాలి.
జీతం :
RRB Group D Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,000/- నుంచి రూ.56,900/- వరకు జీతాలు ఉంటాయి. దీంతో పాటు ఇతర అలవెన్సులు కూడా అందజేస్తారు.
ఎంపిక ప్రక్రియ:
RRB Group D Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పలు దశల్లో జరుగుతుంది.
● కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
● శారీరక సామర్థ్య పరీక్ష
● డాక్యుమెంట్ వెరిఫికేషన్
● వైద్య పరీక్ష
దరఖాస్తు విధానం :
RRB Group D Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. RRB అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22వ తేదీలోపు దరఖాస్తులను సమర్పించాలి.
► ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 22 ఫిబ్రవరి 2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE
1 thought on “RRB Group D Recruitment 2025 | 10th పాసైన వారికి 32,438 జాబ్స్ | కొద్ది రోజులే గడువు”