SBI SO Recruitment 2025 | SBI లో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు | నెలకు రూ.1 లక్ష జీతం

SBI SO Recruitment 2025 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని వివిధ శాఖలలో రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 42 మేనేజర్ మరియు డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. టెక్నికల్ నాలెడ్జ్ కలిగి అనుభవం ఉన్న అభ్యర్థులు స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్(మేనేజర్, డిప్యూటీ మేనేజర్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలను చదివి పోస్టులకు అప్లయి చేసుకోగలరు.

SBI SO Recruitment 2025

పోస్టుల వివరాలు : మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు

మొత్తం పోస్టులు : 42

మేనేజర్(డేటా సైంటిస్ట్) : 13 పోస్టులు ( ఎస్సీ -01, ఎస్టీ-01, ఓబీసీ-03, ఈడబ్ల్యూఎస్-01, UR-07)

డిప్యూటీ మేనేజర్ : 29 పోస్టులు ( ఎస్సీ -04, ఎస్టీ – 03, ఓబీసీ – 07, ఈడబ్ల్యూఎస్ -02, UR -13)

SBI SO Recruitment 2025

Tech Mahindra Freshers Jobs | టెక్ మహీంద్రాలో డిగ్రీ అర్హతతో జాబ్స్

IOCL Recruitment 2025 | IOCL లో 246 పోస్టల భర్తీ

అర్హతలు :

SBI SO Recruitment 2025 మేనేజర్ మరియు డిప్యూటీ మేనేజర్ పోస్టుల కోసం విద్యార్హతలు కింద చూడవచ్చు.

BE / B.Tech/M.Tech in Computer Science / IT/ Electronics / Electrical & Electronics / Electronics & Communication / Data Science / AI & ML / Equivalent degree in Above Disciplines / Msc Data Sc / Msc(Statistics) / MA(Statistics) / M stat / MCA

ఈ రెండు పోస్టులకు కూడా అనుభవం కావాల్సి ఉంటుంది. మేనేజర్ పోస్టులకు సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం కావాలి. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు కసంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం అవసరం.

వయస్సు :

SBI SO Recruitment 2025 మేనేజర్ పోస్టులకు 26 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 24 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

SBI SO Recruitment 2025

జీతం :

మేనేజర్ పోస్టులకు : నెలకు రూ.85,920 నుంచి రూ.1,05,280

డిప్యూటీ మేనేజర్ : నెలకు రూ.64,820 నుంచి రూ.93,960

అప్లికేషన్ ఫీజు :

SBI SO Recruitment 2025 పోస్టులకు ఆన్ లైన్ లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ :

SBI SO Recruitment 2025 ఉద్యోగాలకు అభ్యర్థులను వారి అర్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం : 01 ఫిబ్రవరి, 2025

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 24 ఫిబ్రవరి, 2025

Notification : CLICK HERE

Apply Online : CLICK HERE

Leave a Comment