SCI JCA Recruitment 2025 : Supreme Court of India Junior Court Assistant ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 241 SCI Junior Court Assistant (Group ‘B’ Non-Gazetted) ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మార్చి 8వ తేదీ లోపు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వారు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్, అర్హత, కావాల్సిన డాక్యుమెంట్స్, వయోపరిమితి తదితర సమాచరాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
SCI JCA Recruitment 2025
పోస్టుల వివరాలు :
పోస్టు పేరు : జూనియర్ కోర్టు అసిస్టెంట్
మొత్తం పోస్టులు : 241
అర్హతలు :
SCI JCA Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ 35 WPM తో టైప్ చేయగలగాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
UIIC Apprentice Recruitment 2025 | గవర్నమెంట్ ఇన్సూరెన్స్ సంస్థలో అప్రెంటీస్ జాాబ్స్
వయస్సు :
SCI JCA Recruitment 2025 ఉద్యోగాలకు 08-03-2025 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
SCI JCA Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు UR / OBC / EWS అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
SCI JCA Recruitment 2025 ఉద్యోగాలకు అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. 2 గంటల సమయం కేటాయిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో భాగంగా జనరల్ ఇంగ్లీష్ – 50 ప్రశ్నలు, జనరల్ ఆప్టిట్యూడ్ – 25 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ – 25 ప్రశ్నలు, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ – 25 ప్రశ్నలు అడుగుతారు.
టైపింగ్ టెస్ట్ : టైపింగ్ టెస్ట్ లో 10 నిమిషాల సమయం కేటాయిస్తారు. కంప్యూటర్ మీద ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. 35 WPM వేగంతో 10 నిమిషాల పాటు టైపింగ్ చేయాల్సి ఉంటుంది.
డిస్క్రిప్టివ్ టెస్ట్ : తర్వాత డిస్క్రిప్టివ్ పద్దతిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఎగ్జామ్ నిర్వహిస్తారు. కాంప్రహెన్షన్ ప్యాసేజ్, ప్రెస్సీ రైటింగ్ మరియు ఎస్సే రైటింగ్ నిర్వహిస్తారు. 2 గంటల సమయం కేటాయిస్తారు.
జీతం :
SCI JCA Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.72,040/- జీతం అయితే అందజేస్తారు. బేసిక్ పే వచ్చేసి 35,400 ఉంటుంది. మిగితా అలవెన్సులు మరియు హెచ్ఆర్ఏ కలిపి మొత్తం రూ.72,040 జీతం వస్తుంది.
ముఖ్యమైన తేదీలు :
● ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 05 – 02 – 2025
● ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 08 – 03 – 2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE
Official Website : CLICK HERE