APలో సబ్సిడీ లోన్స్.. ఎలా, ఎక్కడ అప్లయ్ చేయాలి?
ఏపీలోని యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. స్వయం ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం సబ్సిడీ లోన్స్ అయితే ఇవ్వబోతోంది.. వివిధ కార్పొరేషన్ల ద్వారా ఈ రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది..ఈ రుణాలు ఎవరెవరికి ఇస్తున్నారు? ఎలా ఇస్తున్నారు? ఎక్కడ అప్లయ్ చేసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
AP Subsidy Loans ఎవరికి ఇస్తారు?
బీసీ, ఈబీసీ, బ్రాహ్మిణ, కమ్మ, క్షత్రియ, రెడ్డి, వైశ్య అనే ఏడు కార్పొరేషన్ల నుంచి సబ్సిడీ మీద లోన్స్ ఇస్తున్నారు. అయితే ఇందులో స్లాబ్ 1, స్లాబ్ 2, స్లాబ్ 3 అని ఉంటుంది. స్లాబ్ 1 అనుకోండి ఉదాహరణకు మీరు రూ.2,00,000 లోన్ పెట్టారనుకోండి. రూ.75,000 సబ్సిడీ వస్తుంది. బ్యాంక్ లోన్ రూ.1,25,000 మీకు వస్తుంది. అలాగే స్లాబ్ 2లో అయితే రూ.3 లక్షల వరకు లోన్ వస్తుంది. దాంట్లో మీకు రూ.1,25,000 సబ్సిడీ వస్తుంది. రూ.1,75,000 బ్యాంక్ లోన్ వస్తుంది. అలాగే స్లాబ్ 3 చూసుకుంటే.. రూ.5,00,000 లోన్ వరకు లోన్ వస్తుంది. రూ.2,00,000 సబ్సిడీ వస్తుంది. రూ.3,00,000 బ్యాంక్ లోన్ వస్తుంది. ఈ ఏడు కార్పొరేషన్ల నుంచి లోన్ తీసుకోవాలనుకుంటే.. ఈ విధంగా స్లాబ్స్ ప్రకారం లోన్ ఇస్తారు.
కాపు కార్పొరేషన్ లో ఎంత వరకు ఇస్తారు?
అలాగే కాపు కార్పొరేషన్ లో బలిజ, తెలెగా, ఒంటరి కమ్యునిటీస్ తిరుపతి జిల్లాల్లో అర్హులు అవుతారు. కాపు కార్పొరేషన్ లో కూడా స్లాబ్ 1, స్లాబ్ 2, స్లాబ్ 3 మీద సబ్సిడీ లోన్స్ ఇస్తున్నారు. స్లాబ్ 1 లో అయితే రూ.2,00,000 లోన్ తీసుకుంటే రూ.1,00,000 సబ్సిడీ ఇస్తారు. రూ.1,00,000 బ్యాంక్ లోన్ కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే స్లాబ్ 2 లో రూ.3 లక్షలు లోన్ తీసుకుంటే.. రూ.1.5 లక్షలు సబ్సిడీ, స్లాబ్ 3లో రూ.5 లక్షలు లోన్ తీసుకుంటే.. రూ.2.5 లక్షలు సబ్సిడీ ఉంటుంది.
బిసి కార్పొరేషన్ లో మెడికల్ షాపులకు లోన్ :
అలాగే మెడికల్ షాపుల్లాంటి ఏవైన పెట్టుకోవాలనుకుంటే.. బిసి కార్పొరేషన్ లో స్లాబ్ 4 కింద రూ.8 లక్షల వరకు లోన్ పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ సబ్సిడీ రూ.4 లక్షలు వస్తుంది. బ్యాంక్ లోన్ రూ.4 లక్షలు ఇస్తారు. అంటే సగానికి సగం సబ్సిడీ ఇస్తారు. మీరు ఏమైన జనరల్ మెడికల్ షాపులు పెట్టుకోవాలంటే ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు.
కాపు కార్పొరేషన్ లో MSME లోన్స్:
కాపు కార్పొరేషన్ లో చిన్న తరహా పరిశ్రమలు ఏవైన పెట్టుకోవాలనుకుంటే..రూ.25 లక్షల వరకు లోన్స్ ఇస్తారు. అందులో రూ.10 లక్షలు సబ్సిడీ వస్తుంది.. రూ.10 లక్షలు బ్యాంక్ లోన్ ఉంటుంది. ఇక రూ.5 లక్షలు మాత్రం మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్న వారు ఈ సబ్సిడీని అయితే తీసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి?
అయితే దీనికి వయస్సు ఎంత ఉండాలి అంటే.. బిసి కార్పొరేషన్ లో అయితే 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న బిసి వారందరు ఎలిజిబుల్ అవుతారు. కాపు కార్పొరేషన్ లో అయితే 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు మాత్రమే ఉండాలి. బిపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉండాలి.
చివరి తేదీ :
ఈ కార్పొరేషన్ లోన్స్ పెట్టుకోవాలనుకుంటున్న వారు 8-1-2025 నుంచి 16-01-2025 వరకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లలో ఈ లోన్స్ అయితే పెట్టుకోవాలి. మీకు దగ్గరగా ఉన్న సచివాలయానికి వెళ్ళి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ తో అయితే ఈ లోన్స్ కి అప్లయ్ చేసుకోవచ్చు.
ఏం కావాలి?
కార్పొరేషన్ లోన్స్ కి అప్లయ్ చేసుకునే వారు కుల ధ్రువీకరణ పత్రం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, బ్యాంక్ పాస్ బుక్, మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి. ఈ సర్టిఫికెట్లతో సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ తో ఈ లోన్స్ కి అప్లయ్ చేసుకోవచ్చు.
ఎలా ఎంపిక చేస్తారు?
ముందుగా మున్సిపల్ కమిషనర్ దీనిని వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత మండల లెవెల్ లో వెరిఫికేషన్ అయిన తర్వాత బ్యాంక్ కు వెళ్తుంది. బ్యాంక్ లో వారు వెరిఫై చేసి లోన్ అయితే మంజూరు చేస్తారు. ఈ మొత్తం ప్రాసెస్ అనేది ఈనెలలోనే పూర్తి అవుతుంది.