Telangana Inter Results 2025 | తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2025 | TS Inter 1st Year Results 2025 | TS Inter 2nd Year Results 2025 | TS Inter Results 2025

TS Inter Results 2025 తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇప్పుడు ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలను త్వరగా రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా అధికారులు పరీక్షల మూల్యాంకనం వేగవంతంగా చేస్తున్నారు. స్పాట్ వాల్యూయేషన్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది.

TS Inter Results 2025 When were the exam held?

 తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరిగగా, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 6వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగాయి.  ప్రస్తుతం ఇంటర్ పరీక్షల మూల్యాంకనం వేగంగా జరుగుతోంది. మూల్యాంకనం పూర్తి అయిన తర్వాత ఫలితాలను కంప్యూటరీకరణ చేయాల్సి ఉంటుంది. కంప్యూటరీకరణ తర్వాత అధికారులు పరిశీలించి ఫలితాలను విడుదల చేస్తారు. 

35 మార్కులు రాని వారికి గుడ్ న్యూస్: 

ప్రస్తుతం తెలంగాణ ఇంటర్ పరీక్షల మూల్యాంకనం వేగంగా జరుగుతోంది. ఈ తరుణంలో ఇంటర్ బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలో 35 మార్కులు రాని విద్యార్థులు నష్టపోకుండా వారి జవాబు పత్రాలను చీఫ్ ఎక్జామినర్, సబ్జెక్టు నిపుణులతో ర్యాండమ్ వాల్యుయేషన్ చేయిస్తోంది. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు మే నెలలోనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి జూన్ నెలలో ఫలితాలు విడుదల చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.  

Telangana Inter Results Release Date:

TS Inter Results 2025: గతంలో చూసుకుంటే తెలంగాణలో ఇంటర్ ఫలితాలు 2022వ సంవత్సరంలో జూన్ 28వ తేదీన, 2023లో మే 9న, 2024లో ఏప్రిల్ 4వ తేదీన విడుదల చేేశారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు రిజల్ట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తతుం మూల్యాంకనం వేగంగా జరుగుతోంది. రిజల్ట్స్ లో కచ్చితత్వం మరియు పారదర్శకతను నిర్ధారించడానికి అధికారులు మొత్తం మూల్యాంకన ప్రక్రియను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు.

మూల్యాంకనం పూర్తి అయిన తర్వాత ఫలితాలను అధికారిక ఆన్ లైన్ పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు. ఫలితాలను ఏప్రిల్ 24-30 మధ్యలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ఇంటర్ ఫలితాలను విద్యార్థులు సులభంగా బోర్డు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9,96,971 లక్షల మంది విద్యార్థులు హాాజరయ్యారు. 

TS Inter Results 2025 Passing Criteria : 

ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. ఇంటర్ రెండు సంవత్సరాల్లో 750 మార్కులు సాధించిన వారికి గ్రేడ్ ఎ, 600 నుంచి 749 మార్కులు వచ్చిన వారికి గ్రేడ్ బి మరియు 500 నుంచి 599 మార్కులు వచ్చిన వారికి గ్రేడ్ సి లభిస్తుంది. 

How to Check TS Inter Results 2025: 

తెలంగాణ ఇంటర్ ఫలితాలను విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. 

  • ముందుగా అధికారిక వెబ్ సైట్ https://tgbie.cgg.gov.in/ ఓపెన్ చేయాలి.
  • తర్వాత హోమ్ పేజీపై కనిపించే Inter First year results 2025, Inter Second Year Results 2025 ఆప్షన్స్ పై క్లిక్ చేయాలి. 
  • మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. 
  • అలా ఎంటర్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి. 
  • మార్క్స్ మెమోను డౌన్ చేసుకుని భద్రపర్చుకోవచ్చు. 

Leave a Comment