Telangana Inter Results 2025 | TS Inter Results Release date 2025

 Telangana Inter Results 2025 ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఇంటర్ ఫలితాల కోసం తెలంగాణ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ ఫలితాల తేదీని వెల్లడించింది. ఏప్రిల్ 22వ తేదీన ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తున్నారు.  

Telangana Inter Results 2025 

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ ఇదే:

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 9,96,971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 4,88,448 మంది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయగా, 5,08,253 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాశారు. ప్రస్తుతం ఫలితాల కోసం దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ఇంటర్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ మరియు కంప్యూటరీకరణ పనులు పూర్తి కావడంతో ఇంటర్ బోర్డు ఫలితాలను విడుదల చేయనుంది.  

తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో విడుదల చేస్తున్నారు. మంగళవారం విద్యాభవన్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంటర్ ఫలితాలను ప్రకటిస్తారు. ఈసారి మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తున్నారు.

How to Check TS Inter Results 2025: 

  • ఫలితాలు చెక్ చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్ సైట్ https://tgbie.cgg.gov.in/ సందర్శించాలి.
  • ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ అని రెండు ఆప్షన్లు ఉంటాయి. 
  • ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ రిజిల్ట్స్ ఆప్షన్ పై మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 
  • విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ చేయాలి. వెంటనే ఫలితాలు వస్తాయి. 
  • ఫలితాలను పీడీఎఫ్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

Leave a Comment