Telangana VRO Notification Full Details in 2025

తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పోస్టుల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే దాని గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అసలు వీఆర్వో నోటిఫికేషన్ ఎప్పుడు రావొచ్చు? క్వాలిఫికేషన్ ఏంటీ? ఏజ్ లిమిట్ ఏంటీ? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.. అయితే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసింది. అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఉంది. అందుకే త్వరలో అయితే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

వీఆర్వో జాబ్స్ పూర్తి వివరాలు…

అర్హత :
వీఆర్వో ఉద్యాగానికి కనీస అర్హత ఇంటర్మీడియట్ ఉండాలి. ఓపెన్ ఇంటర్ వారు కూడా అప్లయి చేసుకోవచ్చు.

వయస్సు :
వీఆర్వో ఉద్యోగానికి ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే.. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 18-44 వయస్సు నిర్ణయించారు. అయితే ఇప్పుడు 18- 46 ఏళ్ల వరకు ఏజ్ లిమిట్ ఉండొచ్చు. రిజర్వేషన్లను బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితేే ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్ :
సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 150 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. 150 నిమిషాలు సమయం ఇస్తారు. అయితే ఇందులో రెండు రకాలుగా ఉంటుంది. సెక్రటేరియట్ ఎబిలిటీ మరియు జీకే కు సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. సిలబస్ కూడా మీరు ఆల్రెడీ కానిస్టేబుల్, ఎస్సై నోటిఫికేషన్ కి ప్రిపేర్ అవుతున్నారో అదే సిలబస్ ఉంటుంది.

ఎన్ని పోస్టులు ఉంటాయి?
తెలంగాణలో 12,000 పోస్టులు ఉన్నట్లు అంచనా.. అయితే అన్ని పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ చేేయరు. దాదాపు 6 వేల పోస్టులతో నోటిఫికేషన్ అయితే రావొచ్చని అంచనా.

VRO ప్రిపరేషన్ ప్లాన్ :
ముఖ్యంగా అర్థమెటిక్, లాజికల్ రీజనింగ్ మీద ఎక్కువగా ద్రుష్టి పెట్టండి. గతంలో వచ్చిన పేపర్ కూడా రివైజ్ చేయండి. ముఖ్యంగా పోలీస్, గ్రూప్ 4 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారు అదే సిలబస్ చదవడం బెటర్.. తెలంగాణ పాలసీస్, కరెంట్ అఫైర్స్ మీద ద్రుష్టి పెట్టండి..

Leave a Comment