TGSPDCL Recruitment 2025 | తెలంగాణ విద్యుత్ సంస్థలో భారీగా జాబ్స్..

విద్యుత్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్.. తెలంగాణ విద్యుత్ సంస్థ TGSPDCL నుంచి ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ అయితే వెలువడనుంది. మొత్తం 3,260 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

Telangana Electricity Department Jobs 2025

ఖాళీల వివరాలు :

తెలంగాణ విద్యుత్ సంస్థలో ఖాళీల వివరాలను ఒకసారి చూస్తే.. జూనియర్ లైన్ మెన్ (TGSPDCL JLM) పోస్టులు 2,212, సబ్ ఇంజనీర్ పోస్టులు 30, ససిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 18, దీంతో పాటు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపీణీ సంస్థలో 600 జూనియర్ లైన్ మెన్ పోస్టులు, సబ్ ఇంజనీర్ పోస్టులు 300, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 100 ఉన్నాయి.

APSFL JOBS 2025

RAILWAY MTS JOBS 2025

విద్యార్హతలు :

జూనియర్ లైన్ మెన్ పోస్టులకు ITI , సబ్ ఇంజినీర్ పోస్టులకు పాలిటెక్నిక్ డిప్లొమా, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు బీఈ లేదా బీటెక్ చేేసిన వారు అర్హులు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే వచ్చే ఛాన్స్ ఉంది.

వయస్సు:

TGSPDCL Recruitment 2025 కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూనియర్ లైన్ మెన్ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు, సబ్ ఇంజనీర్,అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు 18 నుంచి 44 ఏళ్లు ఉండే అవకాశం ఉంది. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఎంపిక ఎలా చేేస్తారు:

తెలంగాణ విద్యుత్ సంస్థ TGSPDCL ఉద్యోగాలకు దరఖాస్తు చేేసుకున్న వారికి రాత పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష కూడా ఆఫ్ లైన్ విధానంలో నిర్వహిస్తారు. రాత పరీక్ష ఆధారంగానే పోస్టులకు ఎంపిక అయితే ఉండనుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు అయితే జీతం ఉంటాయి.

Leave a Comment