TGSRTC Recruitment 2025 : తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ ఆర్టీసీ సంస్థ వైస్ చైర్మన్, ఎండీ సజ్జనార్ ఉద్యోగాల విషయంలో కీలక ప్రకటన చేేశారు. కార్మికులు, ఉద్యోగులపై పనిభారతం తగ్గించేందుకు త్వరలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఆర్టీసీలో త్వరలోనే 3,038 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా సజ్జనార్ ఈ ప్రకటన చేేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందని, సాధ్యమైనంత త్వరగా 3,038 పోస్టుల నియామకాలు పూర్తి చేస్తామని సజ్జనార్ తెలిపారు. కొత్త పోస్టుల భర్తీతో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులపై పనిభారం తగ్గుతుందని పేర్కొన్నారు.
TGSRTC Recruitment 2025 : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో త్వరలోనే 30, 40 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈక్రమంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంస్థలో 3,038 పోస్టుల భర్తీ గురించి ప్రకటన చేశాారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణను కొత్తగా భర్తీ చేయనున్న ఉద్యోగాలకు అమలు చేస్తున్నారు.
TGSRTC Recruitment 2025 Vacancy Details :
తెలంగాణ ఆర్టీసీలో గత కొంత కాలంగా ఉద్యోగాల నియామకాల కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలోనే ఈ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. అయితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మాత్రం జరగలేదు. ప్రస్తుతం సజ్జనార్ ప్రకటనతో త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. గతంలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పోస్టుల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య : 3,038
పోస్టులు | ఖాళీలు |
డ్రైవర్ పోస్టులు | 2,000 |
శ్రామిక్స్ | 743 |
డిపో మేనేజర్ / అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ | 25 |
అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ | 15 |
డిప్యూటీ సూపరిండెంటెండ్ (ట్రాఫిక్) | 84 |
డిప్యూటీ సూపరిండెంటెండ్ (మెకానికల్) | 114 |
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) | 23 |
సెక్షన్ ఆఫీసర్ (సివిల్) | 11 |
అకౌంట్ ఆఫీసర్ | 6 |
మెడికల్ ఆఫీసర్ (జనరల్) | 7 |
మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) | 7 |
ఇతర అర్హతలు, జీతం వివరాలు, అప్లికేషన్ ఫీజు వివరాలు వయస్సుకు సంబంధించిన సమాచారం పూర్తి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మన వెబ్ సైట్ లో ఉంచుతాము. ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ని ఫాలో అవుతూ ఉండండి.