TS GPO Recruitment 2025 | గ్రామ పాలన అధికారుల పోస్టులకు ఇలా దరఖాస్తు చేసుకోండి

TS GPO Recruitment 2025 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసేందుకు గ్రామ పాలన అధికారుల నియామకాలను చేపడుతుంది. అందులో భాగంగా గ్రామ పాలన అధికారుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే మొదటగా ఈ పోస్టుల్లో పూర్వ వీఆర్వో, వీఆర్ఏలను తీసుకుంటున్నారు. ఇంటర్ లేదా డిగ్రీ అర్హతతో ఐదేళ్ల సర్వీస్ ఉన్న వారికి మొదట ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సేవలను పర్యవేక్షించేందుకు గ్రామ పాలన అధికారులను ప్రభుత్వం నియమించనుంది. గ్రామ పాలన అధికారులుగా పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలు దరఖాస్తు చేసుకోవాలి. వీరి నియామకాలు అయిపోయిన తర్వాత మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసి మిగిలిన ఖాళీలను భర్తీ చేేస్తారు. అప్పుడు నిరుద్యోగులు అందరు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. 

TS GPO Recruitment 2025

పోస్టుల వివరాలు: 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రామ పాలన అధికారుల నియామకాలను చేపడుతున్నారు. మొత్తం 10,954 పోస్టుల నియామకం జరగనుంది. గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుతవం ప్రకటనలో తెలియజేసింది. 

TS GPO Recruitment 2025 Qualifications : 

తెలంగాణ గ్రామ పాలన అధికారి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఇంటర్ ఉత్తీర్ణత సాధించి కనీసం 5 సంవత్సరాలు వీఆర్వోగా పనిచేసి ఉండాలి. లేదా జూనియర్ అసిస్టెంట్ లేదా రకార్డు అసిస్టెంట్ స్థాయి రెగ్యులర్ సర్వీస్ వీఆర్ఏగా పనిచేేసి ఉండాలి.  

TS GPO Recruitment 2025 Age Limit : 

తెలంగాణ గ్రామ పాలన అధికారి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. 

TS GPO Recruitment 2025 Selection Process: 

గ్రామ పాలన అధికారులను ఎంపిక చేేసేందుకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు. 

TS GPO Recruitment 2025 Salary : 

గ్రామ పాలన అధికారిగా ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.45,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. 

TS GPO Recruitment 2025 Duties : 

  • గ్రామ ఖాతాల నిర్వహణ చేయడం.
  • వివిధ ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ భూమలు, నీటి వనరులకు సంబంధించిన విచారణ, రక్షణ చేపట్టడం.
  • ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపికలో విచారణలు చేపట్టడం.
  • ఎన్నికల విధులు నిర్వహించడం.
  • వివిధ శాఖల మధ్య సమన్వయకర్తలుగా పనిచేయడం.

How to aApply TS GPO Recruitment 2025:

పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలు గ్రామ పాలన అధికారి పోస్టుల కోసం గూగుల్ ఫామ్ ని పూర్తి చేసి ఏప్రిల్ 16వ తేేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. గూగుల్ ఫామ్ లో పూర్తి వివరాలను నింపి సబ్మిట్ చేయాలి. ఆ ఫామ్ ని డౌన్ చేసుకుని అభ్యర్థి స్వయంగా సంతకం చేసి ఒక కాపీని సంబంధిత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవ్వాలి. 

  • దరఖాస్తులకు చివరి తేేదీ : 16 – 04 – 2025
NotificationCLICK HERE
Google form Apply LinkCLICK HERE
Official WebsiteCLICK HERE

Leave a Comment