TS Inter Results 2025 తెలంగాణ ఇంటర్ ఫలితాలపై కీలక అప్డేడ్ అయితే రావడం జరిగింది. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు ఇంటర్ పరీక్షల మూల్యాంకనం వేగవంతంగా చేస్తున్నారు. స్పాట్ వాల్యూయేషన్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ చివరి నాటికి ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది.
TS Inter Results 2025 : తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరిగగా, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 6వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగాయి. ప్రస్తుతం ఇంటర్ పరీక్షల మూల్యాంకనం వేగంగా జరుగుతోంది. మూల్యాంకనం పూర్తి అయిన తర్వాత ఫలితాలను కంప్యూటరీకరణ చేయాల్సి ఉంటుంది. కంప్యూటరీకరణ తర్వాత అధికారులు పరిశీలించి ఫలితాలను విడుదల చేస్తారు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే:
TS Inter Results 2025: గతంలో చూసుకుంటే తెలంగాణలో ఇంటర్ ఫలితాలు 2022వ సంవత్సరంలో జూన్ 28వ తేదీన, 2023లో మే 9న, 2024లో ఏప్రిల్ 4వ తేదీన విడుదల చేేశారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు రిజల్ట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తతుం మూల్యాంకనం వేగంగా జరుగుతోంది. రిజల్ట్స్ లో కచ్చితత్వం మరియు పారదర్శకతను నిర్ధారించడానికి అధికారులు మొత్తం మూల్యాంకన ప్రక్రియను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు.
మూల్యాంకనం పూర్తి అయిన తర్వాత ఫలితాలను అధికారిక ఆన్ లైన్ పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు. ఫలితాలను ఏప్రిల్ 24-30 మధ్యలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ఇంటర్ ఫలితాలనుు విద్యార్థులు సులభంగా బోర్డు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు.
How to Check TS Inter Results 2025:
తెలంగాణ ఇంటర్ ఫలితాలను విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈజీగా చెక్ చేసుకోవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్ సైట్ https://tgbie.cgg.gov.in/ ఓపెన్ చేయాలి.
- తర్వాత హోమ్ పేజీపై కనిపించే Inter First year results 2025, Inter Second Year Results 2025 ఆప్షన్స్ పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
- అలా ఎంటర్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి.
- మార్క్స్ మెమోను డౌన్ చేసుకుని భద్రపర్చుకోవచ్చు.
ఇంటర్ కాలేజీలకు సెలవులు ఎప్పుడంటే:
తెలంగాణ ఇంటర్ బోర్డు జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది. మార్చి 30వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు సెలువులు ఉంటాయని పేర్కొంది. జూన్ 2వ తేదీన కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ సంస్థలతో సహా అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలు ఈ షెడ్యూల్ ఖచ్చితంగా పాటించాలని, ఎవరైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.