UPSC IFS Notification 2025 : సివిల్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. UPSC IFS 2025 కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో Indian Forest Service ఉద్యోగాలు 150 ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు upsc.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను 11 ఫిబ్రవరి 2025 వరకు ఆన్ లైన్ లో సమర్పించాలి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కమిషన్ కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించాలి. తర్వాత మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..
UPSC IFS Notification 2025 :
అర్హతలు :
UPSC IFS Notification 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు దారులు తప్పనిసరిగా భారతదేశ పౌరులై ఉండాలి
వయస్సు:
Indian Forest Service ఉద్యోగాలకు దరఖాస్తు చేసే వారికి కనీసం 21 ఏళ్లు నిండ ఉండాలి కానీ 32 ఏళ్లు మించకూడాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
UPSC IFS Notification 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం:
UPSC IFS Notification 2025 పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వారు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే ఉద్యోగం సాధించినట్లే..
జీతం :
UPSC IFS Notification 2025 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.58 వేలు జీతం ఉంటుంది. అన్ని రకాల అలవెన్సులు, బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు :
UPSC IFS Notification 2025 జాబ్స్ కి సంబంధిచ ఆన్ లైన్ అప్లికేషన్లు 22 జనవరి 2025న ప్రారంభమయ్యాయి. 11 పిబ్రవరి 2025 సాయంత్రం 6 గంటల వరకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు.
UPSC IFS Exam 2025 :
Steps to Apply :
మొదట upsc.gov.in వెబ్ సైట్ ని సందర్శించాలి. తర్వాత IFS రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత డిటైల్స్ ఇచ్చి లాగిన అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాలి. అవసరమైన సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి. అనంతరం ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
UPSC IFS Notification : CLICK HERE
Apply Online Here : CLICK HERE
I’m waiting for notifications
I’m waiting for notifications I have a job