What is Post Office Monthly In Scheme ?

పోస్టాఫీస్ మంత్లీ ఇన్ స్కీమ్.. ఈ స్కీమ్ గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియదు.. అందుకే ఇప్పుడు మనం పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.. ఇది ఒక పోస్టాఫీస్ పథకం. పోస్టాఫీస్ కి వెళ్లి మనం అయితే ఈ ఖాతాను ఓపెన్ చేసుకోవాలి. ఈ పథకం ద్వారా మనకు ప్రతి నెలా ఇన్ కమ్ అయితే వస్తుంది. ఈ పథకం ఎలా పనిచేస్తుందంటే.. ఇది వన్ టైమ్ ఇన్వెస్టిమెంట్ ఆప్షన్ అన్నమాట.. అంటే మన దగ్గర ఉన్ డబ్బును పోస్టాఫీస్ లో పెట్టుబడి పెట్టాలి. ఆ డబ్బును ఐదేళ్ల తర్వాత పోస్టల్ వారు మనకు ఇస్తారు. అప్పటి వరకు మన డబ్బు పోస్టాఫీస్ వద్ద సేఫ్ గా ఉంటుంది.

ఈ ఐదేళ్ల పాటు ఆ డబ్బుపై ఎంత అయితే వడ్డీ వస్తుందో.. ఆ వడ్డీ మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. అందుకోసం ముందుగానే మనం పోస్టాఫీస్ వారికి ఒక సేవింగ్ అకౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్ లో వడ్డీ డబ్బులను పోస్టాఫీస్ వారు వేస్తు ఉంటారు. లేకపోతే పోస్టల్ సేవింగ్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. వారు కార్డు కూడా ఇస్తారు.

ఈ స్కీమ్ ఎవరికి బాగా సెట్ అవుతుందంటే.. ఉదాహరణకు మీ పిల్లలు చదువుల కోసం హాస్టల్ ఉంటారు. మీరు ప్రతి నెల వారికి పాకెట్ మనీ వేస్తారు. అలా వేయకుండా ఈ ఖాతా ద్వారా వచ్చే వడ్డీని వారికి పాకెట్ మనీగా ఇవ్వొచ్చు. అదేవిధంగా మీ పేరెంట్స్ ఊళ్లలో ఉన్నారు. వారికి ఈ ఖాతాను ఓపెన్ చేసి కార్డును వారి వద్ద ఉంచండి. వారికి ప్రతినెలా వడ్డీ డబ్బు పడుతుంటుంది. ఈ విధంగా ఖాతాను ఓపెన్ చేయండి.

ఎంత డబ్బు డిపాజిట్ చేయాలి?

ఈ ఖాతాలో ఎంత డబ్బును డిపాజిట్ చేయాలంటే… మినిమమ్ 1000 రూపాయల నుంచి ఓపెన్ చేయవచ్చు. ఇందులో మీరు సింగిల్ అకౌంట్ చేస్తే గరిష్టంగా రూ.9 లక్షల వరకు డపాజిట్ చేసుకోవచ్చు. అదే జాయింట్ అకౌంట్ అంటే మీరు, మీ భాగస్వామి కలిసి ఓపెన్ చేస్తే రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. జాయింట్ ఖాతాలో ముగ్గురు కలిసి కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

ఎంత డిపాజిట్ చేస్తే ఎంత డబ్బు వస్తుంది?

ఉదాహరణకు మీరు రూ.5 లక్షలు డిపాజిట్ చేశారు అనుకోండి.. మీ బ్యాంక్ అకౌంట్ లో ప్రతినెలా రూ.3,083 వడ్డీ పడుతూ ఉంటుంది. ఈ రూ.5 లక్షలు ఐదు సంవత్సరాల తర్వాత మీరు తీసుకోవచ్చు. మీరు రూ.9 లక్షలు డిపాజిట్ చేశారనుకోండి.. మీకు వడ్డీ వచ్చేసి రూ.5,550 ప్రతనెలా వస్తుంది. అదే మీరు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశారు అనుకుందాం.. అప్పుడు మీరు రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తారు. దాని వడ్డీ వచ్చే రూ.9,250 ప్రతినెలా మీ అకౌంట్ లో జమ అవుతుంది. అయితే వడ్డీ అనేది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది.

మధ్యలోనే డబ్బులు ఇస్తారా?

ఒకవేళ మీరు పోస్టాఫీస్ లో డబ్బులు డిపాజిట్ చేశారు. మీకు అత్యవసరంగా కావాల్సి వస్తుంది. అప్పుడు తీసుకోవచ్చా? అనే సందేహం మీకు రావొచ్చు. అవును తీసుకోవచ్చు. అయితే అందుకోసం మీరు ఒక సంవత్సరం అయితే ఆగాల్సి ఉంటుంది. ఎందుకంటే అకౌంట్ ఓపెన్ చేసిన ఒక సంవత్సరం లోపల డబ్బు ఇవ్వరు. అయితే సంవత్సరంలోప మనం చనిపోతే నామినికి డబ్బు అయితే ఇస్తారు. మనకు మాత్రం ఒక సంవత్సరం తర్వాత మాత్రమే డబ్బులను తిరిగి ఇస్తారు.

పెనాల్టీ ఎంత?

అకౌంట్ ఓపెన్ చేసిన ఒక సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు ఇస్తారు. అయితే మనం పెనాల్టీ అయితే కట్టాల్సి ఉంటుంది. 2 శాతం వరకు పెనాల్టీ ఉంటుంది. ఆ పెనాల్టీ దేనిపైన వేస్తారు అంటే.. ఎంత అయితే పోస్టాఫీస్ వద్ద ఉందో దానిలో 2 శాతం పెనాల్టీ డబ్బులు కట్ చేసుకొని మిగితా డబ్బును తిరిగి ఇస్తారు. ఉదాహరణకు మీరు రూ.10 లక్షలు డిపాజిట్ చేశారు. దీనికి 2 శాతం అంటే రూ.20 వేలు కట్ చేసుకుని మిగితా డబ్బును పోస్టాఫీస్ ఇస్తుంది.

ఇక 3 నుంచి 5 సంవత్సరాల మధ్య విత్ డ్రా చేసుకుంటే 1 శాతం పెనాల్టీ వేస్తుంది పోస్టాఫీస్.. అంతే రూ.10 లక్షలు డిపాజిటి చేశారనుకోండి.. రూ.10 వేలు కట్ చేసుకొని మిగితా డబ్బులను అయితే తిరిగి ఇస్తుంది. ఇక ఐదు సంవత్సరాలు పూర్తి అవ్వగానే మనం పోస్టాఫీస్ కి వెళ్లి చెప్పాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇస్తే వాళ్లే అంత చూసుకొని మీ డబ్బులు ఇస్తారు. ఈ విధంగా ఈ పథకం పనిచేస్తుంది..

Leave a Comment