చంద్రబాబు అంటేనే టెక్నాలజీ.. ఎందుకంటే టెక్నాలజీని అంతలా ప్రోత్సహిస్తారు.. అందులో భాగంగానే త్వరలో ఏపీలో WhatsApp Governance తీసుకురానున్నారు. ఈనెల 18వ తేదీ నుంచి WhatsApp Governance ని తీసుకురాబోతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సంక్షేమ పథకాల్లో మోసాలు జరగకుండా కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
ఎన్ని రకాల సేవలు :
ఇక కొత్తగా తీసుకురానున్న ఈ వాట్పాప్ గవర్నెన్స్ లో 150 రకాల సేవలు ఉంటాయి. ప్రతిదీ సెల్ ఫొన్ లోనే పొందేలా ఈ వ్యవస్థను రూపొందించారు. క్యాస్ట్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, అడంగల్, నేటివిటీ వంటి పత్రాలను వాట్పాప్ ద్వారా పొందవచ్చు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురావడంతో సర్టిఫికెట్లు, వివిధ రకాల సేవల కోసం ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అప్లికేషన్లను అధికారులకు అందజేస్తే చాలా.. ఆ సర్టిఫికెట్లను వాట్సాప్ ద్వారా ప్రజలకు చేరవేసేలా చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం 150 సేవలు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తారు. త్వరలోనే ఆ సంఖ్యను పెంచుతారని చంద్రబాబు తెలిపారు.
కొత్త ఫీచర్ :
కొంత మంది అప్లికేషన్లు నింపడంలో ఇబ్బందులు పడుతుంటారు. అప్లిషన్ నింపడానికి రాక ఇతరుల సహాయం తీసుకుంటుంటారు. అలాంటి వారికి కొత్త ఫీచర్ అయితే ఈ వాట్సాప్ గవర్నెన్స్ లో తీసుకురానున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మాటలు చెబితే చాలు ఆ వివరాలను సేకరించి రికార్డు చేయనున్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపుతారు. దరఖాస్తుదారులకు ఉపయోగపడేలా వాయిస్ లేదా టెక్ట్స్ ద్వారా సర్టిఫికెట్లు జారీ చేసే ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రజల కోసం ఈ వ్యవస్థను తెలుగు మరియు ఇంగ్లీష్ రెండింటీలోనూ అందుబాటులో తీసుకురానున్నారు.
Also Read : How to download ration card online?Full information in 2025

ప్రస్తుతం whatsapp వాడని వారు లేరు. పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ల వరకు వాట్సాప్ యూజ్ చేస్తున్నారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ఫుల్ గా సేవలు అందించవచ్చు. అత్యవసర సమయంలో ప్రజలను అప్రమత్తం చేయవచ్చు. అంతేకాదు రైతులు ఏ సమయంలో ఏ మందులు వాడలనే విషయంలో సమాచారం తెలపవచ్చు. వాట్సాప్ ద్వారా సులువుగా పన్నులు చెల్లించవచ్చు. దేవదాయ, మున్సిపల్, రెవెన్యూ సేవలను పొందవచ్చు.
ప్రస్తుతం 100 నుంచి 150 సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. తర్వాత ఆ సంఖ్యను పెంచనున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆంధ్రప్రదేశ్ లో మొదలుపెట్టనున్నారు. ఈ వ్యవస్థ ద్వారా ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా అన్ని సర్టిఫికెట్లను వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ఆదాయ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ, స్టడీ సర్టిఫికెట్ లను వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ఈ సేవలు వెబ్ సైట్ లో సమచారం ఉంచుతారు.